Earthquake : రష్యాలో భారీ భూకంపం
రష్యాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 7.8 గా నమోదయింది. ఇండోనేషియలోనూ భూకంపం సంభవించింది
రష్యాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 7.8 గా నమోదయింది. శుక్రవారం తెల్లవారుజామున ఈ భూకంపం సంభవించింది. రష్యాలోని కమ్చట్కాలో భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు. రష్యాలో సంభవించిన భూకంపం పది కిలోమీటర్ల లోతులో నమోదయిందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. రష్యాలో రెండుసార్లు ఈ భూకంపం సంభవించిందని, తొలి సారి రిక్టర్ స్కేల్ పై తీవ్రత 7.8 గా నమోదయిందని, రెండోసారి తీవ్రత 5.8గా ఉందని అధికారులు తెలిపారు.
ఇండోనేషియేలోనూ...
దీంతో అధికారులు సునామీ హెచ్చరికలు జరిపారు. అయితే ఈ భారీ భూకంపం వల్ల జరిగిన ప్రాణ, ఆస్తి నష్టంపై మాత్రం ఇంకా వివరాలు అందాల్సి ఉంది. ఇక ఇండోనేషియలోనూ భూంకంపం సంభవించింది. ఇండోనేషియలో భూకంప తీవ్రత 6.1 గా నమోదయిందని యూఎస్ జియోలాజికల్ సర్వేఅధికారులు తెలిపారు. ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వేకువ జామున భూకంపం రావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.