చాలా పెద్ద తప్పు చేసింది.. మూల్యం చెల్లించుకోక తప్పదు: ఇరాన్

మూల్యం చెల్లించుకోక తప్పదు

Update: 2025-06-23 04:07 GMT

ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడులను ఇరాన్ సుప్రీం నేత ఆయతుల్లా అలీ ఖమేనీ తీవ్రంగా ఖండించారు. ఇజ్రాయెల్, అమెరికాకు తప్పకుండా బుద్ధి చెబుతామని, ప్రతిస్పందన ఖచ్చితంగా ఉంటుందని హెచ్చరించారు. మూడు అణు కేంద్రాలపై అమెరికా దాడికి ఇరాన్ సుప్రీం నాయకుడు ఖండించారు.

ఆదివారం నాడు ఇరాన్‌లోని ఫోర్డో అణు కేంద్రం, మరో రెండు ప్రదేశాల పైన అమెరికా 30,000 పౌండ్ల బంకర్-బస్టర్ బాంబులను జారవిడిచింది. అమెరికా దురాక్రమణకు ప్రతిస్పందనకు జవాబు ఉంటుందని ఇరాన్ ప్రతిజ్ఞ చేసింది. తమ ప్రతిస్పందనను స్వీకరించాలని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ అన్నారు. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్‌పై జరిగిన అత్యంత తీవ్రమైన పాశ్చాత్య సైనిక చర్య ఈ దాడులని ఇరాన్ చెబుతోంది.


Tags:    

Similar News