నేటి నుంచి ఐదురోజులు లాక్ డౌన్

నేటి నుంచి శుక్రవారం వరకూ షాంఘై నగరంలో లాక్ డౌన్ అమలులో ఉంటుందని అధికారులు వెల్లడించారు.

Update: 2022-03-28 04:22 GMT

చైనాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో కేసులు ఎక్కువగా ఉన్న నగరాల్లో లాక్ డౌన్ విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేసుల తీవ్రత తగ్గించడానికి లాక్ డౌన్ ఒక్కటే మార్గమని అక్కడి వైద్య నిపుణులు కూడా సూచిస్తున్నారు. దీంతో చైనాలోని షాంఘైలో ఐదు రోజుల పాటు లాక్ డౌన్ విధించారు. నేటి నుంచి శుక్రవారం వరకూ షాంఘై నగరంలో లాక్ డౌన్ అమలులో ఉంటుందని అధికారులు వెల్లడించారు.

అత్యవసర సేవలు తప్ప...
ప్రజలు కూడా కోవిడ్ ను అరికట్టేందుకు సహకరించాలని ప్రభుత్వం కోరుతుంది. తప్పనిసరి పరిస్థితి అయితేనే బయటకు రావాలని సూచిస్తుంది. షాంఘై నగరంలో అత్యవసర సేవలు మినహాయించి మిగిలిన వాటిని బంద్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. చాలా మంది కరోనా వ్యాక్సిన్ తీసుకోకపోవడంతోనే కేసుల పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు. ఈ నెలలోనే 57 వేల కేసులకు పైగా నమోదవ్వడం ఆందోళన కల్గిస్తుంది.


Tags:    

Similar News