చైనాలో మరోసారి లాక్ డైన్

చైనాలో మరోసారి కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో పలు నగరాల్లో లాక్ డౌన్ విధించారు

Update: 2022-10-11 03:42 GMT

చైనాలో మరోసారి కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో పలు నగరాల్లో లాక్ డౌన్ విధించారు. కరోనా వైరస్ కేసులు ఎక్కువవ్వడంతో లాక్ డౌన్ ను విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కఠిన ఆంక్షలను అమలు చేస్తుంది. ఉత్తర చైనాలోని షాంగ్జీ ప్రావిన్స్ లో ఫెన్ యాంగ్ సిటీలో లాక్ డౌన్ విధించారు. ఇన్నర్ మంగోలియా ప్రాంతంలో ఆంక్షలు విధించారు. రాజధాని హోహాట్ లో కూడా కరోనా వైరస్ కేసుల సంఖ్య ఎక్కువగా బయటపడ్డాయి.

ఆంక్షలు మరింత...
ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను నిలిపివేశారు. రెండు వారాలుగా రెండు వేల కేసులు నమోదయ్యాయని అధికారులు చెబుతున్నారు. ఈ నెల తొలి వారంలో సెలవు దినాలు ఎక్కువగా రావడంతో ప్రజలు కోవిడ్ నిబంధనలను పాటించలేదు. దీంతో మరోసారి కరోనా పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. నిన్నటి నుంచి కొన్ని నగరాల్లో లాక్ డౌన్ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జీరో కోవిడ్ విధానంలో భాగంగా కరోనా ఆంక్షలను గట్టిగా అమలుపరుస్తున్నారు.


Tags:    

Similar News