నేడు నైసార్ ఉపగ్రహ ప్రయోగం
శ్రీహరికోట సతీష్ ధావన్ సెంటర్ నుంచి నుంచి నేడు నైసార్ ఉపగ్రహ ప్రయోగం జరగనుంది
శ్రీహరికోట సతీష్ ధావన్ సెంటర్ నుంచి నుంచి నేడు నైసార్ ఉపగ్రహ ప్రయోగం జరగనుంది. నిన్నటి నుంచి ఈ ఉపగ్రహ ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభమయింది. ఈరోజు సాయంత్రం 5.40 గంటలకు GSLV-F16 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. నాసా, ఇస్రోలు ఉమ్మడి భాగస్వామ్యంతో ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. మొత్తం 11,200 కోట్ల రూపాయలతో నాసా, ఇస్రో ఉమ్మడి ప్రయోగం చేయనుంది.
అత్యం ఖరీదైన...
అత్యంత ఖరీదైన భూపరిశీలన ఉపగ్రహంగా నైసార్ రికార్డు సృష్టించనుంది. భూమిపై వాతావరణ పరిస్థితులతో పాటు కొండ చరియలు విరిగిపడటం, తుపానులు, క్లౌడ్ బరెస్ట్ లు వంటి సమాచారాన్ని ముందుగానే తెలియజేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఉపగ్రహం 2,392 కిలోల బరువు ఉంది. జీఎస్ఎల్వీ ఎఫ్ 16 వాహన నౌక ద్వారా ఈ ఉపగ్రహం నింగిలోకి దూసుకు వెళ్లనుంది. ప్రపంచంలోనే మొదటి ప్రయోగంగా ఇది రికార్డుకు ఎక్కనుంది.