కందుల జాహ్నవి కుటుంబానికి 264 కోట్ల పరిహారం

అమెరికాలో మరణించిన తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల కుటుంబానికి 262 కోట్లు చెల్లించాలని సియాటెల్ ఒప్పందం కుదుర్చుకుంది

Update: 2026-02-12 05:13 GMT

అమెరికాలో మరణించిన తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల కుటుంబానికి 262 కోట్లు చెల్లించాలని సియాటెల్ ఒప్పందం కుదుర్చుకుంది. కర్నూలు జిల్లాలకు చెందిన కందుల జాహ్నవి ఉన్నత చదువుల కోసం అమెరికాకు 2023లో వెళ్లారు. అక్కడ యూనివర్సిటీలో చదువుకుంటున్న సమయంలో రోడ్డు దాటుతుండగా ఒక పోలీసు వాహనం ఢీకొట్టింది. 2023 జనవరి 23 వతేదీ రాత్రి ఈ ప్రమాదం జరిగింది. పెట్రోలింగ్ వాహనం ఢీకొట్టడంతో జాహ్నవి అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటన అప్పట్లో సంచలనం కలిగించింది.

పోలీసు అధికారి జోకులు...
అయితే ఈ ప్రమాదానికి కారణమయిన పోలీసు అధికారి కెవిస్ డవే మాత్రం ఆమె మృతిపై జోకులు వేశాడు. అతని మాటలు ఆయన బాడీ కెమెరాలో రికార్డయ్యాయి. మరణించడాన్ని సీరియస్ గా తీసుకోకుండా జోకులు వేయడాన్నిభారత్ తీవ్రంగా తప్పుపట్టింది. జాహ్నవి సాధారణ వ్యక్తి అని, మరణానికి విలువలేదన్న వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకుని దీనిపై అభ్యంతరం తెలిపింది. దీంతో సదరు పోలీసు అధికారిని విధుల నుంచి తప్పించారు. అతి వేగంతో జాహ్నవిని ఢీకొట్టడం వల్లనే జాహ్నవి మరణించిందని తేల్చారు.
ఒప్పందం మేరకు...
అయితే సిటీ అటార్నీ ఎరికా ఇవాన్స్ ప్రకటన విడుదల చేస్తూ ప్రమాదంలో మరణించిన కందుల జాహ్నవి కుటుంబానికి 29 మిలియన్ డాలర్ల పరిహారం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ కేసులో పరిహార ఒప్పందం కోసం ఇరుపక్షాలూ గత వారం కోర్టులో దరఖాస్తు చేసినట్లు తెలిసింది. అయితే ఈ పరిహారంతో కనీసం జాహ్నవి కుటుంబానికి కొంత మేరకు అయినా ఉపశమనం లభిస్తుందని భావిస్తున్నామని, జాహ్నవి మృతి మాత్రం అత్యంత బాధాకరమని తెలిపారు. 29 మిలియన్ డాలర్ల నష్ట పరిహారంపై ఇరు పక్షాలు ఒప్పందం కోసం దరఖాస్తు చేయగా ఈ నిర్ణయం తీసుకుంది.










Tags:    

Similar News