భారత సైన్యం చంపిన ఆ ఉగ్ర‌వాది జ్ఞాపకార్థం స్మారక చిహ్నం..!

ఆపరేషన్ సింధూర్‌లో భారత సైన్యం 100 మందికి పైగా పాకిస్తాన్ ఉగ్రవాదులను హతమార్చింది.

Update: 2025-09-20 06:02 GMT

ఆపరేషన్ సింధూర్‌లో భారత సైన్యం 100 మందికి పైగా పాకిస్తాన్ ఉగ్రవాదులను హతమార్చింది. జైషే మహ్మద్ కమాండర్ మసూద్ అజర్ సోదరుడు యూసుఫ్ అజార్ కూడా మ‌ర‌ణించిన వారి జాబితాలో ఉన్నాడు. అయితే.. ఇప్పుడు యూసఫ్ అజర్ స్మారక చిహ్నం నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

పాకిస్థాన్‌లోని పెషావర్‌లోని మర్కజ్ షహీద్ మక్సూదాబాద్‌లో యూసుఫ్ అజార్ సంస్మరణ సభ జరగనుంది. ఈ కార్య‌క్ర‌మానికి పలువురు జైష్ కమాండర్లు హాజరుకానున్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో మసూద్ అజార్ కుటుంబానికి చెందిన 10 మంది మరణించారు.

బహవల్‌పూర్‌లోని జైష్ ప్రధాన కార్యాలయం వద్ద ఉన్న జామియా మసీదు సుభాన్ అల్లాపై భారత సైన్యం దాడి చేసింది. ఇందులో యూసుఫ్‌తో సహా చాలా మంది ఉగ్రవాదులు హతమయ్యారు. వీరందరి మరణాలను మసూద్ అజార్ కూడా ధృవీకరించారు.

ఆపరేషన్ సింధూర్ తర్వాత ఒక ప్రకటన విడుదల చేస్తూ మసూద్ అజార్.. ఈ దాడిలో తన సోదరుడితో పాటు తన అక్క, ఆమె భర్త, మేనల్లుడు, అతని భార్యతో సహా 5 మంది పిల్లలు మరణించారని చెప్పాడు.

ముంబైలో 26/11 దాడి నుండి జమ్మూ మరియు కాశ్మీర్‌లోని పుల్వామా, ఉరీ దాడుల వరకూ ప్రధాన సూత్రధారి మసూద్ అజార్. అత‌డిని 2019లో ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించింది. గత ఏడాది నవంబర్‌లో మసూద్ అజార్ పాకిస్థాన్‌లోని పంజాబ్‌లో భారత్‌కు వ్యతిరేకంగా ఉద్వేగభరితమైన ప్రసంగం చేశాడు.

Tags:    

Similar News