Israel attacks Iran : ఇరాన్ పై ఇజ్రాయిల్ భీకర దాడులు.. భారీగా ఆస్తి నష్టం
ఇరాన్ పై ఇజ్రాయిల్ దాడులకు దిగింది. భీకర దాడులతో ఇరాన్ రాజధాని టెహ్రాన్ పై ఇజ్రాయిల్ క్షిపణులతో దాడులకు
ఇరాన్ పై ఇజ్రాయిల్ దాడులకు దిగింది. భీకర దాడులతో ఇరాన్ రాజధాని టెహ్రాన్ పై ఇజ్రాయిల్ క్షిపణులతో దాడులకు దిగడంతో పెద్దయెత్తున నష్టం సంభవించింది. ఇరాన్ - ఇజ్రాయిల్ ల మధ్య గత కొంతకాలంగా ఘర్షణలు జరుగుతున్నాయి. దీంతో ప్రపంచ దేశాల హెచ్చరికలను ఏమాత్రం ఖాతరు చేయకుండా ఇరాన్ పై ఇజ్రాయిల్ ఆపరేషన్ రైజింగ్ లయన్ ను ప్రారంభిచింది. ఈ దాడుల్లో ఇరాన్ పారామిలటరీ రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ తో పాటు మరికొందరు మరణించినట్లు తెలిసింది. ఈ దాడిని తమను తాము రక్షించుకునేందుకే జరిపామని ఇజ్రాయిల్ దాడులు జరిపింది. డ్రోన్లత పాటు క్షిపణలుతో ఇరాన్ లో ఉన్న అణుస్థావరాలు, సైనిక శిబిరాలపై దాడులను నిర్వహించింది.
ఆస్తి, ప్రాణ నష్టం...
అయితే టెహ్రాన్ లో జరిపిన ఇజ్రాయిల్ దాడుల్లో మేజర్ జనరల్ హుస్సేన్ సలామి మరణించారని అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రచురించాయి. ఇరాన్ కూడా ప్రతి దాడులను ప్రారంభించింది. దీంతో ఇరాన్ - ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్న యుద్ధంపై అంతర్జాతీయ సమాజంలో ఆందోళన వ్యక్తమవుతుంది. ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో రెవెల్యూషనరీ గార్డులోని ఉన్నత స్థాయి అధికారులతో పాటు పలువురు అణు శాస్త్రవేత్తలు కూడా మరణించనిట్లు చెబుతున్నారు. అనేక బవనాలు నేలమట్టమయ్యాయి. ఇరాన్ కు భారీగా ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరిగిందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. యుద్ధం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తమను తాము కాపాడుకోవడం కోసం..
ఇరాన్ లోని న్యూక్లియర్ ప్లాంట్, సైనిక స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని ఇజ్రాయిల్ చెబుతుంది. వరస పేలుళ్లతో ఇరాన్ ప్రజలు భయంతో తమను తాము కాపాడుకోవడానికి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళుతున్నారు. అయితే ఇరు దేశాలమధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాక్ తమ గగనతలాలన్ని మూసివేసింది. దేశంలోని అన్ని విమానాశ్రయాల రాకపోకలను నిలిపివేసింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో ఎమెర్జెన్సీని ప్రకటించారు. తమను నాశనం చేయడం కోసం అణ్వాయుధాలు రెడీ చేస్తున్న ఇరాన్ పై దాడులుచేయడం మినహా తమకు మరొక మార్గం లేదని ఇజ్రాయిల్ చెబుతుంది. అయితే ఈ యుద్ధం ప్రభావం ప్రపంచ మార్కెట్ లపై పడనున్నాయి. ముఖ్యంగా పెట్రోలు, డీజిల్ ధరపై ప్రభావం చూపనున్నాయి.