యాంకర్ న్యూస్ చదువుతుండగా బాంబు పేలుళ్లు

సిరియాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తోంది. ఓ మీడియా ఛానల్‌లో లేడీ యాంకర్ న్యూస్ చదువుతుండగా బాంబు దాడి జరిగింది

Update: 2025-07-17 04:01 GMT

సిరియాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే ఆర్మీ బేస్‌లతో పాటు పలు ప్రభుత్వ కార్యాలయాలపై బాంబు దాడులకి ఇజ్రాయెల్ తెగబడుతోంది. ఓ మీడియా ఛానల్‌లో లేడీ యాంకర్ న్యూస్ చదువుతుండగా.. తన వెనుక వైపు బాంబు దాడి జరిగడంతో యాంకర్ అక్కడి నుంచి పరుగులు పెట్టిన ఘటన లైవ్ లో జరిగింది.

సిరియాపై ఆగని...
సిరియాను హెచ్చరిస్తూ ఇజ్రాయెల్‌ రక్షణశాఖ మంత్రి ఇజ్రాయెల్‌ కట్జ్ ఇప్పటికే హెచ్చరికలు చేశారు.. కానీ.. సిరియా పట్టించుకోలేదు. దాంతో ఇక దాడులు తప్పవని కట్జ్ సంకేతాలిచ్చాడు. ఈ క్రమంలో సిరియాపై బాంబుల వర్షం కురుస్తోంది. న్యూస్ చదువుతుండగా వెనక బాంబులు పడటంతో భయపడిపోయిన యాంకర్ పరుగులు తీయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


Tags:    

Similar News