Nepal : నేడు నేపాల్ కేబినెట్ సమావేశం
నేపాల్ లో నేడు తాత్కాలిక ప్రధాని సుశీల కార్కి కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు
నేపాల్ లో నేడు తాత్కాలిక ప్రధాని సుశీల కార్కి కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. తాత్కాలిక ప్రధానిగా సుశీల కార్కిని నియమించడంతో నేడు జరిగే కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. కాగా నేపాల్ లో కొంత పరిస్థితులు సద్దుమణిగాయి. శాంతి భ్రదతలు అదుపులోకి వచ్చినట్లు సైన్యం ప్రకటించింది.
కీలక అంశాలపై...
అయితే నేడు తాత్కాలిక ప్రధాని సుశీాల కార్కీ ఆధ్వర్యంలో జరిగే కేబినెట్ సమావేశంలో ఇటీవల జరిగిన ఘర్షణలు, ఆందోళనలపై చర్చ జరిగే అవకాశముంది. మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించే ఛాన్స్ ఉంది. నేపాల్ లో ఇప్పటికే చాలా ప్రాంతాల్లో కర్ఫ్యూ ఎత్తివేశారు. దీంతో నేపాల్ లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి.