కెనడాలో భారతీయ మహిళ హత్య

కెనడాలోని టొరంటోలో ముప్ఫయేళ్ల భారతీయ మహిళ హత్యకు గురయ్యారు

Update: 2025-12-24 07:18 GMT

కెనడాలోని టొరంటోలో ముప్ఫయేళ్ల భారతీయ మహిళ హత్యకు గురయ్యారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టి, ఫస్ట్ డిగ్రీ మర్డర్ కేసులో నిందితుడి కోసం గాలిస్తున్నారు. టొరంటో పోలీసుల కథనం ప్రకారం...హత్యకు గురైన మహిళను హిమాన్షీ ఖురానాగా గుర్తించినట్లు తెలిపింది. స్ట్రాచన్ అవెన్యూ, వెల్లింగ్టన్ స్ట్రీట్ వెస్ట్ ప్రాంతంలో మహిళ కనిపించడంలేదంటూ ఫిర్యాదు అందిన మరుసటి రోజు, శనివారం ఓ నివాసంలో ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఈ విషయాన్ని కెనడియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ వెల్లడించింది.

నిందితుడిపై వారెంట్ జారీ...
ఈ కేసులో 32 ఏళ్ల అబ్దుల్ ఘఫూరీపై ఫస్ట్ డిగ్రీ మర్డర్ ఆరోపణలతో పోలీసులు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఘఫూరీ కూడా టొరంటో నివాసితుడేనని పోలీసులు తెలిపారు.ఈ ఘటనపై టొరంటోలోని భారత హైకమిషన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఇది “విషాదకరమైన, కలవరపెట్టే ఘటన”గా పేర్కొంది.“హిమాన్షీ ఖురానా హత్య విషయం తీవ్రంగా కలిచివేసింది. ఆమె కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి,” అని హైకమిషన్ తెలిపింది. గత కొన్ని రోజులుగా ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నామని, దర్యాప్తు కొనసాగుతున్నంతకాలం కుటుంబానికి అవసరమైన సహకారం అందిస్తామని కాన్సులేట్ స్పష్టం చేసింది.


Tags:    

Similar News