Narendra Modi : ట్రంప్ అలా అంటే.. మోదీ వెంటనే ఇలా రియాక్ట్ అయ్యారుగా

ఇటీవల అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు

Update: 2025-09-06 06:13 GMT

ఇటీవల అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత్–అమెరికా సంబంధాలపై అనుకూల వ్యాఖ్యలు చేశారు. “అమెరికా, భారత్ మధ్య ప్రత్యేక సంబంధం ఉంది. నేను ఎప్పటికీ ప్రధానమంత్రి మోదీకి స్నేహితుడిగానే ఉంటాను” అని ట్రంప్ పేర్కొన్నారు.

భారత్ - అమెరికా సంబంధాలపై...
దీనికి ట్రంప్ వ్యాఖ్యలకు స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ, “భారత్–అమెరికా సంబంధాలపై ట్రంప్ చేసిన సానుకూల వ్యాఖ్యలను నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఆయన భావాలకు పూర్తి స్థాయిలో ప్రతిస్పందిస్తున్నాను” అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో భారత్ -అమెరికాల మధ్య సహృద్భావకరమైన వాతావరణానికి అవకాశం ఏర్పడిందని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


Tags:    

Similar News