Narendra Modi : నేడు చైనాలో మోదీ.. జిన్ పింగ్ తో భేటీ.. కీలక అంశాలపై చర్చ

నేడు భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనాలో పర్యటిస్తున్నారు. ప్రధాని మోదీ నేడు చైనా అధినేత జిన్ పింగ్ తో సమావేశమవుతారు

Update: 2025-08-31 02:03 GMT

నేడు భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనాలో పర్యటిస్తున్నారు. దాదాపు ఏడేళ్ల తర్వాత భారత ప్రధాని మోదీ చైనా దేశంలో పర్యటిస్తున్నారు. ప్రధాని మోదీ నేడు చైనా అధినేత జిన్ పింగ్ తో సమావేశమవుతారు. రెండు దేశాల పరస్పర సంబంధాలపై చర్చిస్తారు. రెండు రోజుల పాటు చైనాలోనే ఉంటారు. షాంఘై సహకార సంస్థ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొంటారు. అనంతరం చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో సమావేశమవుతారు. ఇద్దరి మధ్య రెండు దేశాలకు సంబంధించిన కీలక అంశాలపై చర్చ జరుగుతుంది.

ట్రంప్ నిర్వాకం తర్వాత...
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ ఉత్పత్తుల ఎగుమతులపై అదనపు సుంకాలు విధించిన తర్వాత చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. చైనాతో కేవలం ఆర్ధిక సంబంధాలు మాత్రమే కాకంుడా వాణిజ్య పరమైన ఒప్పందాలను కూడా ఇరు దేశాల నేతలు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే భారత్ సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై కూడా చర్చించనున్నారు. ప్రధానంగా తూర్పు లదాఖ్ కాంట్రవర్సీ తర్వాత దెబ్బతిన్న సంబంధాలను ఇరు దేశాలు పునరుద్ధరించుకునే ఛాన్స్ కనిపిస్తుంది.
అనేక కీలక అంశాాలపై...
వీరిద్దరి భేటీలో భారత్ - చైనా సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పడంతో పాటు వాణిజ్యానికి దారులు తెరవడంతో పాటు నేరుగా విమానాలను ప్రవేశపెట్టడం వంటి కీలక అంశాలపై ఇప్పటికే రెండు దేశాల మధ్య సయోధ్య కుదిరిన నేపథ్యంలో వీరిద్దరి మధ్య చర్చలు మరిన్ని కీలక అంశాలకు దారితీసే అవకాశముందని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో ఇరు దేశాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణని వ్యవహరించేందుకు అవసరమైన అంశాలను ప్రధానంగా చర్చించనున్నారు. అందుకే ఈ సమావేశం కీలకమనే అందరూ భావిస్తున్నారు.




















Tags:    

Similar News