నేడు చైనాకు ప్రధాని నరేంద్ర మోదీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం జపాన్ లో పర్యటిస్తున్నారు. ఈరోజు జపాన్‌ నుంచి సాయంత్రం చైనాకు నరేంద్ర మోదీ చేరుకోనున్నారు

Update: 2025-08-30 03:20 GMT

భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం జపాన్ లో పర్యటిస్తున్నారు. ఈరోజు జపాన్‌ నుంచి సాయంత్రం చైనాకు నరేంద్ర మోదీ చేరుకోనున్నారు. ఎస్‌సీవో శిఖరాగ్ర సదస్సుకు మోదీ హాజరుకానున్నారు. జిన్‌పింగ్‌తో రెండుసార్లు భేటీకానున్న మోదీ ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. చైనా, భారత్ సంబంధాలపై చర్చించనున్నారు.

జిన్ పింగ్ తో భేటీలో...
ట్రంప్ సుంకాలు విధించిన నేపథ్యంలో భారత్ వస్తువుల ఎగుమతులు, దిగుమతులపై కూడా జిన్ పింగ్ తో చర్చించే అవకాశముందని చెబుతున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వం కావాలంటే చైనా, భారత్ లు కలసి పనిచేయాలని ఇప్పటిక ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు నిచ్చిన నేపథ్యంలో ఆయన పర్యటన చైనాలో కొనసాగనుంది.


Tags:    

Similar News