నేడు భూమికి శుభాంశు శుక్లా బృందం

భారత వ్యోమగామి శుభాంశు శుక్లా నేడు భూమికి చేరనున్నారు

Update: 2025-07-15 03:01 GMT

భారత వ్యోమగామి శుభాంశు శుక్లా నేడు భూమికి చేరనున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూమికి డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ బయల్దేరింది. షెడ్యూల్ కంటే పది నిమిషాలు ఆలస్యంగా తిరుగు ప్రయాణ ప్రక్రియ మొదలయింది. దాదాపు 22 గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత మంగళవారం మధ్యాహ్నం పసిఫిక్ మహాసముద్ర జలాల్లో ల్యాండింగ్ కానున్నారు.

వారం రోజుల తర్వాత...
యాక్సియం -4 మిషన్ లో భాగంగా మరో ముగ్గురు వ్యోమగాములతో కలసి నేడు భూమికి చేరుకోనున్నారు. దాదాపు పద్దెనిమిది రోజుల పాటు అంతరిక్షంలోనే ఉండి పలు ప్రయోగాలు చేశారు. ఈరోజు మధ్యాహ్నం 3.01 గంటలకు అమెరికాలోని కాలిఫోర్నియాలోని తీరానికి చేరువలో ఉన్న సముద్రంలో వ్యోమనౌక దిగనుంది. వారం రోజుల పాటు రీహెబిలిటేషన్ సెంటర్ లో ఉండి తర్వాత శుభాంశు శుక్లా భారత్ కు చేరుకోనున్నారు.


Tags:    

Similar News