తీరు మార్చుకోకపోతే అమెరికాలోకి అడుగుపెట్టలేరు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు దీర్ఘకాలిక సిరల లోపం ఉన్నట్లు వైట్‌హౌస్ ప్ర‌క‌టించింది.

Update: 2025-07-18 11:30 GMT

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు దీర్ఘకాలిక సిరల లోపం ఉన్నట్లు వైట్‌హౌస్ ప్ర‌క‌టించింది. కాళ్ల కింది భాగంలో వాపు వచ్చిన తర్వాత ట్రంప్‌కు ఆరోగ్య‌ ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. సాధారణమైన, ఎలాంటి ప్రమాదం లేని సిరల వ్యాధితో బాధపడుతున్న‌ట్లు తేలింద‌ని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ వెల్ల‌డించారు. ట్రంప్ కాళ్లపై నిర్వహించిన అల్ట్రాసౌండ్ పరీక్షల్లో దీర్ఘకాలిక సిరల లోపం బయటపడింది. ఈ పరిస్థితి 70 ఏళ్లు పైబడిన వ్యక్తులలో తరచుగా కనిపిస్తుంది. కాలు వాపుతో పాటు ట్రంప్ చేతి వెనుక భాగంలో గాయాలు ఉన్నాయి. తరచుగా కరచాలనం చేయడం, ఆస్ప్రిన్ వాడకం దీనికి కారణమని కరోలిన్ లీవిట్ తెలిపారు. ఇటీవల న్యూజెర్సీలోని తూర్పు రూథర్‌ఫోర్డ్‌లో జరిగిన FIFA క్లబ్ ప్రపంచ కప్ 2025 ఫైనల్‌కు హాజ‌రైన సంద‌ర్భంలో తీసిన‌ 79 ఏళ్ల ట్రంప్ ఫొటో ఒక‌టి బాగా వైర‌ల్ అయింది. అందులో ఆయ‌న‌ చీలమండల చుట్టూ వాపు కనిపించింది. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది.

Tags:    

Similar News