Flood Effect : వరదల విలయం.. 800 మంది మృతి

ఇండోనేషియా, శ్రీలంక, థాయ్ లాండ్ లో భారీ వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి

Update: 2025-12-01 03:17 GMT

ఇండోనేషియా, శ్రీలంక, థాయ్ లాండ్ లో భారీ వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. వరదలు, కొండచరియలు విరిగిపడి ఇండోనేషియాలో 440 మంది, శ్రీలంకలో 334 మంది, థాయ్ లాండ్ లో 170 మంది మృతి చెందారు. వందల సంఖ్యలో గల్లంతయ్యారు. వేలాది ఇళ్లు, రోడ్లు కొట్టుకుపోయాయి. రవాణా, కమ్యూనికేషన్ వ్యవస్థలు పూర్తిగా దెబ్బతిన్నాయి. థాయ్ లాండ్ లో 30 లక్షల మంది, ఇండోనేషియాలో 11 లక్షల మంది, శ్రీలంకలో ఐదు లక్షల మంది ప్రభావితమయ్యా రు. గల్లంతయిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

శ్రీలంకలో బీభత్సం...
శ్రీలంకలో దిత్వా తుఫాన్‌ బీభత్సం సృష్టిస్తుంది. కొండచరియలు విరిగిపడడంతో 334 మంది మృతి చెందారు. మరో 370 మంది ఆచూకీ గల్లంతయినట్లు అధికారులు తెలపిరాు. ఆపరేషన్‌ సాగర్‌ బంధు భారత్‌ ప్రత్యేకంగా చేపట్టింది. కొలంబో నుంచి స్వదేశానికి 323 మంది భారతీయులను రప్పించే పనికి పూనుకుంది. వరద ప్రాంతాల్లో చిక్కుకున్న భారతీయుల్లో. 45 మందిని కొలంబో చేర్చిన భారత వాయుసేన సహాయ కార్యక్రమాల్లో పాల్గొననుంది. శ్రీలంక దిత్వా తుపాను కారణంగా తీవ్రంగా నష్టపోయింది. ఈ నష్టం నుంచి తేరుకోవడం కష్టమే.


Tags:    

Similar News