Srilanka : శ్రీలంకలో వరదల బీభత్సం.. 56 మంది మృతి
శ్రీలంకలో భారీ వర్షాలు పడుతున్నాయి. వరదలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి.
శ్రీలంకలో భారీ వర్షాలు పడుతున్నాయి. వరదలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 56 మంది చనిపోగా, 600కు పైగా ఇళ్లు దెబ్బతిన్నాయని అధికారులు వెల్లడించారు. కొలంబో నుంచి మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న బదుల్లా-నువారా ఎలియాలో కొండచరియలు విరిగిపడి నిన్న 25 మందికి పైగా మరణించినట్లు తెలిపారు. భారీ ఆస్తినష్టం సంభవించింది. ప్రజలు నిరాశ్రయులయ్యారు.
భారీ ఆస్తి నష్టం...
ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. భారీ వరదలకు రోడ్లు, రైల్వే ట్రాక్ లు మునిగిపోయాయని, నదులు ఉప్పొంగుతున్నాయని చెప్పారు. భారీ వరదలు, వానలతో శ్రీలంక అతలాకుతలమవుతుంది. హాయక చర్యలను ప్రభుత్వం ప్రారంభించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింంది. మరొకవైపు దైత్వా తుపాను కూడా శ్రీలంక తీరం వైపు వస్తుండటంతో మరింత పరిస్థితి దయనీయంగా మారే అవకాశముందన్నఅంచనాలు వినపడుతున్నాయి.