నేపాల్ లో భారీ వర్షాలు...17 మంది మృతి

నేపాల్ లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కుండపోత వర్షాలతో కొండచరియలు విరిగిపడి 17 మంది మరణించారు.

Update: 2022-09-17 12:43 GMT

నేపాల్ లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కుండపోత వర్షాలతో కొండచరియలు విరిగిపడి 17 మంది మరణించారు. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. సుదర్ పశ్చిమ్ ప్రావినస్ లోని అచ్ఛం జిల్లాలో భయానక పరిస్థితి నెలకొంది. అక్కడ కొండ చరియలు విరిగిపడుతుండటంతో ప్రజలు భయకంపితులవుతున్నారు. అనేక మంది కొండ చరియల కింద చిక్కుకున్నారని సమాచారం.

కొండచరియల కింద...
అయితే కొండచరియల కింద చిక్కుకున్న కొందరిని సహాయక దళాలు రక్షించాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. ఈ వరదల కారణంగా కొందరు గల్లంతయినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో సహాయక చర్యలను ప్రభుత్వం ముమ్మరం చేసింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది. రవాణా వ్యవస్థకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది.


Tags:    

Similar News