వెనెజువెలాలో మరోసారి టెన్షన్ నెలకొంది. కారకాస్ లోని అధ్యక్ష భవనంలో కాల్పులు కలకలం రేపాయి. వెనెజువెలలా అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్స్బాధ్యతలను చేపట్టిన గంటల్లోనే కాల్పులు చోటు చేసుకోవడం కలకలం రేపింది. సెంట్రల్ కారకాస్ లోని మిరోఫ్లోర్స్ ప్యాలెస్ లో డ్రోన్ లు ఎగిరాయి. దీనిని గుర్తించిన భద్రతాదళాలు డ్రోన్లపై కాల్పులు జరిపాయి.
అమెరికా మాత్రం...
అయితే డ్రోన్లు ఎక్కడి నుంచి వచ్చాయన్నది మాత్రం ఇంకా నిర్ధారణ కాలేదు. కానీ కాల్పుల తర్వాత పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుందని అధికారులు వెల్లడించారు. కారకాస్ అధ్యక్ష భవనపై డ్రోన్లు ఎగరడంతో ఎవరి పని అన్న దానిపై విచారణ జరుపుతున్నారు. అమెరికా మాత్రం తమకు సంబంధం లేదని తెలిపింది. కాల్పులకు భద్రతాదళాల మధ్య సమన్వయ లోపమని మరికొన్ని కథనాలు వెలువడుతున్నాయి.