గుండెపోటుతో చైనా మాజీ ప్రధాని లీ కెకియాంగ్ మృతి

చైనా మాజీ ప్రధాని లీ కెకియాంగ్ మృతి చెందారు. ఆయన గుండెపోటుతో మృతి చెందారు

Update: 2023-10-27 04:29 GMT

చైనా మాజీ ప్రధాని లీ కెకియాంగ్ మృతి చెందారు. ఆయన గుండెపోటుతో మృతి చెందారు. 68 ఏళ్ల వయసున్న్ లీ కెకియాంగ్ మరణించినట్లు అధికారికంగా ధృవీకరించారు. జీ జిన్ పింగ్ కు ముదు ఆయన అనేక సంస్కరణలను తెచ్చి లీ కెకియాంగ్ చైనాలో గుర్తింపు తెచ్చుకున్నారు. పదేళ్ల పాటు ఆయన ప్రధానమంత్రిగా పనిచేశారు. ఆయన ఆలోచనలన్నీ చైనా అభివృద్ధి పట్లే సాగేవి. లీ కెకియాంగ్ భవిష్యత్ నేతగా మారతాడని భావించినా జిన్ పింగ్ కారణంగా ఆయన సేవలు వెలుగులోకి రాలేదు.

పదేళ్లు ప్రధానిగా...
68 ఏళ్ల వయసులో లీ కెకియాంగ్ మరణించడం పట్ల చైనీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారిగా గుండెపోటు రావడంతో ఆయనను ఈరోజు తెల్లవారు జామున ఆసుపత్రికి తరలించారు. అయినా ఫలితం లేదు. చికిత్స పొందుతూ మరణించారని చైనా మీడియా ప్రకటించింది. ఆయన కొంతకాలంగా షాంఘై నగరంలోనే ఉంటున్నారు. చైనా ఆర్థిక సంస్కరణల్లో కీలక భూమిక పోషించిన నేతగా లీ కెకియాంగ్ గుర్తింపు పొందారు. ఆయన సారధ్యంలో చైనా మరింత అభివృద్ధి చెందుతుందని ప్రజలు కూడా ఆశించారు.


Tags:    

Similar News