బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి చెందారు

Update: 2025-12-30 02:11 GMT

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి చెందారు. బీఎన్పీ అధినేతగా ఉన్న ఖలీదా జియా గత కొద్ది రోజులుగా అస్వస్థతగా ఉన్నారు. ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎనభై ఏళ్ల ఖలీదా జియా ఈరోజు తుదిశ్వాస విడిచారు. ఖలీదా జియా బంగ్లాదేశ్ కు రెండు సార్లు ప్రధానిగా పనిచేశారు. దేశానికి తొలి మహిళ ప్రధానిగా ఖలీదా జియా చరిత్ర సృష్టించారు.

రెండుసార్లు ప్రధానిగా...
ఖలీదా జియా భర్త జియావుర్ రహమాన్ మృతి అనంతరం రాజకీయాల్లోకి ప్రవేశించిన ఖలీదా జియా అనేక విప్లవాత్మకమైన మార్పులకు దేశంలో శ్రీకారం చుట్టారు. అలాగే ఆమె అనేక అవినీతి అక్రమాల కేసుల్లో జైలు శిక్షను కూడా అనుభవించి ప్రజాస్వామ్యయుతంగా తాను అనుకున్న విజయాలను సాధించగలిగారు. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధినేగా ఆమె దేశానికి అనేక సేవలందించారు. ఖలీదా జియా మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటించారు.


Tags:    

Similar News