పాక్ మాజీ అధ్యక్షుడు ముషారాఫ్ మృతి

పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారాఫ్ మృతి చెందారు. 79 ఏళ్ల వయసున్న ముషారాఫ్ గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నారు

Update: 2023-02-05 06:43 GMT

పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారాఫ్ మృతి చెందారు. 79 ఏళ్ల వయసున్న ముషారాఫ్ గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నారు. గుండెపోటుతో ముషారాఫ్ మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. దుబాయ్ లోని అమెరికన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు పాక్ మీడియా వెల్లడించింది.

సైనిక అధికారిగా...
1943 ఆగస్టు 11 ఢిల్లీలో జన్మించిన ముషారాఫ్ దేశ విభజన తర్వాత పాక్ కు వెళ్లిపోయారు. సైన్యంలో చేరి దేశాధ్యక్షుడిగా ఎదిగారు. 2001 నుంచి 2008 వరకూ పాకిస్థాన్ అధ్యక్షుడిగా ముషారాఫ్ పనిచేశారు. 1999లో నవాజ్ షరీఫ్ ప్రభుత్వంపై తిరుగుబాటు ేసి పాకిస్థాన్ పగ్గాలు చేపట్టిన ముషారాఫ్ అనంతరం అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టారు. గత ఆరేళ్ల నుంచి దుబాయ్ లో ఆశ్రయం పొందుతున్నారు. 2016 నుంచి ఆయన దుబాయ్ లోనే ఉంటున్నారు. ముషారాఫ్ మరణాన్ని పాక్ మీడియా థృవీకరించింది.


Tags:    

Similar News