బహిరంగంగా మాజీ ప్రధాని షింజో అబే కాల్చివేత

జపాన్ మాజీ ప్రధాని షింజో అబేను కాల్చి చంపారు. శుక్రవారం పశ్చిమ జపాన్‌లోని నారాలో ఎన్నికల ప్రచారంలో ఉండగా

Update: 2022-07-08 06:21 GMT

జపాన్ మాజీ ప్రధాని షింజో అబేను కాల్చి చంపారు. శుక్రవారం పశ్చిమ జపాన్‌లోని నారాలో ఎన్నికల ప్రచారంలో ఉండగా కాల్పులు జరిపినట్లు పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ NHK నివేదించింది. నిందితుడిని అరెస్టు చేశారు. జపాన్ టైమ్స్ నివేదించిన ప్రకారం, 67 ఏళ్ల అబే నారాలోని ఒక వీధిలో ఉదయం 11:30 గంటల ప్రాంతంలో ఎన్నికల ప్రచార ప్రసంగం చేస్తున్నప్పుడు గుర్తు తెలియని వ్యక్తి షాట్‌గన్‌తో దాడి చేసాడు. ప్రధాని షింజో అబే ఛాతీలో బుల్లెట్ దూసుకెళ్లింది. కాల్పులు జరిపిన తర్వాత అబేకు రక్తస్రావం అయిందని, గుండె ఆగిపోయిందని స్థానిక అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.

అబే ప్రసంగిస్తుండగా దుండగులు రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ఘటనలో షింజో అక్కడికక్కడే కుప్పకూలారు. బుల్లెట్లు ఆయన ఛాతీలోకి దూసుకెళ్లడంతో తీవ్ర రక్తస్రావమైంది. కాగా సంఘటన జరిగిన వెంటనే ఆయనను ఒక హెలికాప్టర్‌లో నారా మెడికల్‌ యూనివర్శిటీ వైద్యశాలకు తరలించారు. అయితే అప్పటికే ఆయన శరీరంలో ఎలాంటి కదలికలు లేవని, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ షింజో కన్నుమూశారని అక్కడి అధికారులు తెలిపారు. 2006 - 2007, 2012 - 20 రెండు పర్యాయాలుగా జపాన్‌ ప్రధానిగా సేవలు అందించారు షింజో అబే. అబే కుప్పకూలిన సమయంలో తుపాకీ కాల్పుల వంటి శబ్దం వినిపించింది. సంఘటనా స్థలంలో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. బూడిదరంగు టీ షర్టు ధరించిన 41 ఏళ్ల వ్యక్తి అనుమానితుడిని ఘటనా స్థలంలో భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అబేపై కాల్పులు జరిపిన చోట నుంచి పోలీసులు తుపాకీని కూడా స్వాధీనం చేసుకున్నారు. అనుమానితుడిని నారా నివాసి టెత్సుయా యమగామిగా గుర్తించారు.


Tags:    

Similar News