ప్రపంచ బిలియనీర్ల జాబితాలో ఎలాన్ మస్క్ టాప్

ఫోర్బ్స్ జులై నెలలో ప్రకటించిన ప్రపంచ బిలియనీర్ల జాబితాలో ఎలాన్ మస్క్ టాప్ లో నిలిచారు.

Update: 2025-07-09 11:30 GMT

ఫోర్బ్స్ జులై నెలలో ప్రకటించిన ప్రపంచ బిలియనీర్ల జాబితాలో ఎలాన్ మస్క్ టాప్ లో నిలిచారు. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్నారు. ఈ ఏడాది జూన్‌తో పోలిస్తే మస్క్ సంపద 16 బిలియన్ డాలర్లు తగ్గినప్పటికీ 407 బిలియన్ డాలర్లతో అగ్రస్థానంలోనే ఉన్నారు. ఒరాకిల్‌ సహ వ్యవస్థాపకులు లారీ ఎలిసన్‌ నాలుగో స్థానం నుంచి రెండో స్థానానికి చేరుకున్నారు. 7 రోజుల్లోనే దాదాపు 52 బిలియన్ డాలర్లు సంపద తగ్గడంతో టాప్ 10 సంపన్నుల జాబితాలో మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్‌కు స్థానం దగ్గలేదు. ఆయన సంపద ప్రస్తుతం 124 బిలియన్ డాలర్లుగా ఉంది. 116 బిలియన్‌ డాలర్ల సంపదతో ప్రపంచ కుబేరుల్లో 15వ స్థానంలో ముకేశ్‌ అంబానీ ఉన్నారు.

Tags:    

Similar News