Afghanistan : ఆప్ఘనిస్థాన్ లో భూకంపం.. తీవ్రత ఎంతంటే?

ఆప్ఘనిస్థాన్ లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 6.1 తీవ్రతగా నమోదయింది

Update: 2024-01-11 12:39 GMT

ఆప్ఘనిస్థాన్ లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 6.1 తీవ్రతగా నమోదయింది. ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో భూకంపం సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. భూకంప తీవ్రతకు భయాందోళనలకు గురైన ప్రజలు బయటకు పరుగులు తీశారు. నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ తెలిపిన వివరాల ప్రకారం కాబూల్ కు 241 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం కేంద్రీకృతమయింది.

ఢిల్లీలోనూ ప్రకంపనలు...
అయితే ఆప్ఘనిస్థాన్ భూకంపం సంభవించడంతో దాని ప్రభావం భారత్ పై కూడా పడింది. మన దేశంలోని ఢిల్లతో పాటు ఉత్తరాదిలోను పలు ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. ఆప్ఘనిస్థాన్ లో భూకంప తీవ్రత వల్ల ఎంత ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందన్న దానిపై ఇంకా వివరాలు తెలియరాలేదు. అయితే కొన్ని భవనాలు పాక్షికంగానూ, మరికొన్ని పూర్తిగా ధ్వంసమయినట్లు తెలిసింది.



Tags:    

Similar News