పాకిస్థాన్ లో భూకంపం.. వణికిపోయిన ప్రజలు

పాకిస్థాన్ లోని పెషావర్, మన్షేరా, బాలాకోట్, చర్సాడాతో సహా ఖైబర్-పఖ్తున్ఖ్వాలోని అనేక నగరాల్లో ప్రకంపనలు సంభవించాయి.

Update: 2022-01-15 06:13 GMT

గత రాత్రి పాకిస్థాన్ లోని ఉత్తర ప్రాంతంలో భారీ భూంకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 5.6 గా నమోదైంది. ఈ భూకంపంతో పాక్ ప్రజలు వణికిపోయారు. కాగా.. భూకంప సమయంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్థానిక వాతావరణ శాఖ తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్ -తజికిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో 100 కి.మీ లోతులో భూకంప కేంద్రం నమోదై ఉందని తెలిపింది.

పాకిస్థాన్ లోని పెషావర్, మన్షేరా, బాలాకోట్, చర్సాడాతో సహా ఖైబర్-పఖ్తున్ఖ్వాలోని అనేక నగరాల్లో ప్రకంపనలు సంభవించాయి. అలాగే ఉత్తరాదిలోని గిల్గిట్-బాల్టిస్థాన్ ప్రాంతంలో కూడా భూకంపం సంభవించింది. 15 రోజుల్లో పాక్ లో భూ ప్రకంపనలు రావడం ఇది రెండోసారి. జనవరి 1న పాకిస్తాన్‌లో 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. పాకిస్తాన్‌లోని ఉత్తర భాగంలో ఉన్న ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని కొన్ని ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. ఈ ప్రకంపనలు ప్రావిన్స్ రాజధాని పెషావర్‌లో కూడా కనిపించాయి. దీంతో ఇక్కడ నివసిస్తున్న ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. పాకిస్తాన్ వాతావరణ శాఖ ప్రకారం.. స్వాత్, పెషావర్, లోయర్ దిర్, స్వాబి, నౌషేరా, చిత్రాల్, మర్దాన్, బజౌర్, మలాకంద్, పబ్బి, అకోరా, ఇస్లామాబాద్‌లలో సాయంత్రం 6.15 గంటలకు ఆఫ్ఘనిస్తాన్-తజికిస్తాన్ సరిహద్దులో భూకంపం సంభవించింది.




మంగళవారం తెల్లవారుజామున అమెరికాలోని అలస్కాలో భూకంపం సంభవించింది. ఇక్కడి అలూటియన్ దీవుల్లో పలుచోట్ల భూకంపం సంభవించింది. ఇందులో అత్యంత బలమైన భూకంపం తీవ్రత 6.8గా నమోదైంది. ఈ భూకంపాల కేంద్రం ఉత్తర పసిఫిక్‌లోని సముద్రం కింద ఉందని, అలాస్కాలోని తక్కువ జనాభా ఉన్న ప్రాంతంలో ప్రకంపనలు సంభవించాయని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News