Russia : రష్యాలో భూకంపం.. తీవ్రత ఎంతంటే?
రష్యాలో మరోసారి భూకంపం సంభవించింది.
రష్యాలో మరోసారి భూకంపం సంభవించింది. తూర్పు తీరంలోని కామ్చాట్కా రీజియన్ లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 7.1 తీవ్రతగా నమోదయింది. భూకంప కేంద్రాన్ని పది కిలోమీటర్ల లోతులో అధికారులు గుర్తించారు. ఇటీవల వరసగా రష్యాను భూకంపాలు వణికిస్తున్నాయి. ప్రజలు భయాందోళనల మధ్య బతుకుతున్నారు.
ఆస్తి, ప్రాణ నష్టంపై...
ఇటీవల తూర్పు తీరంలోని కామ్చాట్కా రీజియన్ లో భూకంపం సంభవించింది. నాడు రిక్టర్ స్కేల్ పై 8.8 తీవ్రతగా నమోదయింది. అయితే భారీ భూకంపం కారణంగా ప్రజలు భయాందోళనలతో ఇళ్లలో నుంచి బయటకు వచ్చారు. అయితే ఈ భూకంప తీవ్రత వల్ల ఎంత ఆస్తినష్టం, ఎంత మేరకు ప్రాణ నష్టం జరిగిందన్న వివరాలు తెలియాల్సి ఉంది.