Earth Quake : రష్యాలో భారీ భూకంపం

రష్యా తీరంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 8.7గా నమోదయింది.

Update: 2025-07-30 02:07 GMT

రష్యాతీరంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 8.7గా నమోదయింది. రష్యాలోని ఈస్టర్న్ ప్రాంతమైన కన్చుట్కాలో ఈరజు తెల్లవారు జామున సంభవించిన భారీ భూకంపంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం సముద్రం లోతులో బూంకంపం సంభవించింది. భారీ భూకంపంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.

జపాన్ కు కూడా...
జపాన్ కు కూడా భూకంప తీవ్రత కనిపించడంతో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. దీంతో అధికారుల అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి సహాయక చర్యలు ప్రారంభించారు. రానున్న కొద్ది గంటల్లో రష్యా, జపాన్ లోని కొన్ని ప్రాంతాలకు సునామీ తరంగాలు చేరుకుంటాయని అమెరికా సునామీ హెచ్చరికలు జారీ చేసింది. అయితే రష్యాలో సంభవించిన భూకంప తీవ్రత కారణంగా ఎంత మేరకు నష్టం సంభవించిందన్నది ఇంకా తెలియరాలేదు.


Tags:    

Similar News