Earth Quake : అమెరికాలోని అలస్కాలో భూకంపం.. భారత్ లోనూ
అమెరికాలోని అలస్కాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 7.3 తీవ్రతగా నమోదయింది
earthquake occurred in cuba
అమెరికాలోని అలస్కాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 7.3 తీవ్రతగా నమోదయింది. దీంతో ప్రభుత్వం సునామీ హెచ్చరికలు జారీ చేసింది. అమెరికాలోని అలస్కా తీరంలో ఈభూకంప తీవ్రత కనిపించింది. యూఎస్ జియోలాజికల్ సర్వే సునామీ హెచ్చరికలు జారీ చేసింది. అయితే భారీ గా భూకంపతీవ్రత సంభవించడంతో ప్రజలు భయాందోళనలు చెందారు.
రిక్టర్ స్కేల్ పై...
అయితే ఇప్పటి వరకూ ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు వెల్లడి కాలేదు. అక్కడి కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 12.37 గంటలకు ఈ భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు. ఇరవై కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. దక్షిణ అలస్కా, అలస్కా, పెనిన్ సులా ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. భారత్ లోనూ భూకంపం సంభవించింది. హర్యానాలో సంభవించిన ఈ భూకంప తీవ్రత 3.3 గా నమోదయింది.