Earth Quake : బంగ్లాదేశ్ లో భారీ భూకంపం
బంగ్లాదేశ్ లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 5.5 తీవ్రతగా నమోదయింది.
బంగ్లాదేశ్ లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 5.5 తీవ్రతగా నమోదయింది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఈ భూకంపం సంభవించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే అధికారులు తెలిపారు. భూకంప తీవ్రతకు భయపడి ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఢాకాకు యాభై కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే అధికారులు వెల్లడించారు. భూమికి పది కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు అధికారులు వెల్లడించారు.
భారత్ లోనూ...
అయితే ఈ భూకంప తీవ్రత కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం పై పూర్తి స్థాయి సమాచారం మాత్రం ఇంకా అందలేదు. పొరుగున ఉన్న బంగ్లాదేశ్ లో భూప్రకంపనలు భారత్ లోని కోల్ కత్తాలోనూ కనిపించాయి. కోల్ కత్తాలో ఈరోజు ఉదయం 10.10 గంటలకు భూమి కంపించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పశ్చిమ బెంగాల్ లోని కూచ్ బెహర్, దక్షిణ, ఉత్తర దినాజ్ పూర్ తో పాటు అనేక ప్రాంతాల్లో భూ ప్రకంపలనలు సంభవించినట్లు అధికారులు తెలిపారు. అయితే భారత్ లో ఈ భూకంప తీవ్రత వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని చెప్పారు.