earthquake occurred in cuba
ఫిలిప్పీన్స్ లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 7.4 తీవ్రతగా నమోదయింది. ఫిలిప్పీన్స్ లోని మిండనోవా ద్వీపంలో భారీ భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు. దీంతో సునామీ హెచ్చరికలను జారీ చేశారు. భూకంప తీవ్రతకు ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. సునామీ హెచ్చరిక కూడా జారీ చేయడంతో ప్రభుత్వం అప్రమత్తం చేసింది.
సునామీ హెచ్చరికలు...
ఫిలిప్పీన్స్ లో తరచూ భూకంపాలు సంభవిస్తుండటం ఆందోళనకు గురి చేస్తుంది. సునామీ హెచ్చరికల కారణంగా పసిఫిక్ తీరంలో భారీగా అలలు ఎగిసి పడతాయని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఈ భూకంప తీవ్రత కారణంగా జరిగిన నష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పూర్తి సమాచారం అందాల్సి ఉంది.