వెనెజువెలా పరిస్థితులతో మరింత దిగజారనున్న క్యూబా

వెనెజువెలా అధ్యక్షుడు నికోలాస్ మదురో అధికారాన్ని కోల్పోవడంతో క్యూబా పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారనున్నాయి.

Update: 2026-01-06 01:46 GMT

వెనెజువెలా అధ్యక్షుడు నికోలాస్ మదురో అధికారాన్ని కోల్పోవడంతో క్యూబా పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారనున్నాయి. క్యూబా సంక్షోభాన్ని ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్యూబా పరిస్థితిపై స్పందించారుక. క్యూబా కుప్పకూలుతోందని, పూర్తిగా ముగిసిపోయే దశకు వెళ్తోందని వ్యాఖ్యానించారు. దాదాపు కోటి జనాభా ఉన్న క్యూబా, మూడింతల జనాభా కలిగిన చమురు సంపన్న దేశం వెనెజువెలాపై గణనీయమైన ప్రభావం చూపిందని పరిశీలకులు చెబుతున్నారు. మరోవైపు, క్యూబాలో ఎన్నేళ్లుగా విద్యుత్ కోతలు, నిత్యావసరాల కొరత ప్రజలను వేధిస్తున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో భవిష్యత్తు మరింత కఠినంగా ఉండవచ్చన్న ఆందోళన అక్కడి ప్రజల్లో పెరిగింది. వెనుజువెలాలో పరిస్థితులు క్యూబాను కూడా వణికిస్తున్నాయి. వెనెజులా అమెరికా గుప్పిట్లోకి వెళ్లడంతో మరింత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలున్నాయని అంతర్జాతీయ మీడియా కూడా అభిప్రాయపడుతుంది.

క్యూబాకు చమురును పంపుతూ...
గత మూడు నెలల్లో రోజుకు సగటున 35 వేల బ్యారెళ్ల చమురును వెనెజువెలా క్యూబాకు పంపిందని, ఇది క్యూబా మొత్తం అవసరాల్లో సుమారు నాలుగో వంతని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే ప్రస్తుతం అమెరికా నీడలో ఉన్న నూతన ప్రభుత్వం వెనెజువెలా నుంచి క్యూబాకు చమురు సరఫరాను కొనసాగించేందుకు అనుమతిస్తుందా అనే ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం లేదని తెలిపాయి. ఇంతకుముందు మెక్సికో రోజుకు 22 వేల బ్యారెళ్ల చమురు పంపేదని, అయితే అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సెప్టెంబర్ ప్రారంభంలో మెక్సికో సిటీకి వెళ్లిన తర్వాత అది 7 వేల బ్యారెళ్లకు పడిపోయిందని పినోన్ తెలిపారు. “ఇప్పుడు మెక్సికో ముందుకు వచ్చే పరిస్థితి లేదు. అలా జరిగితే అమెరికా ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తుందని మీడియా వెల్లడించింది. వెనెజువెలా నుంచి కొంత చమురు వస్తున్నప్పటికీ విద్యుత్ కోతలు క్యూబాలో తీవ్రంగానే ఉన్నాయి.
చమురు పంపిణీ ఆగితే...
అది పూర్తిగా ఆగితే తక్షణ భవిష్యత్తులో పరిస్థితి విపత్తుగా మారే అవకాశాలు కొట్టిపారేయలేకపోతున్నారరు. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు కొనుగోలు చేసే స్థోమత క్యూబాకు లేదని అంటున్నారు. రష్యా ఒక్కటే మిగిలిన మిత్రదేశమని, అది సంవత్సరానికి సుమారు 20 లక్షల బ్యారెళ్ల చమురు క్యూబాకు పంపుతోంది.లోటును భర్తీ చేసే సామర్థ్యం రష్యాకు ఉంది. కానీ రాజకీయ సంకల్పం ఉందా అనే విషయం తెలియాల్సి ఉంది. రష్యా జోక్యం ఉక్రెయిన్ అంశంలో అమెరికాతో చర్చలకు ఆటంకం కలిగించవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతంది. చైనా సహకారం పొందాలంటే ప్రైవేట్ రంగానికి తలుపులు తెరచి, ప్రభుత్వ రంగాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందన్న సూచనలు వినపడుతున్నాయి. అమెరికా అధ్యక్షడు ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ, వెనెజువెలాలో చమురు ఉత్పత్తి కొనసాగించేందుకు, పెంచేందుకు పెట్టుబడులు పెట్టే చమురు కంపెనీలకు అమెరికా ప్రభుత్వం పరిహారం చెల్లించే అవకాశం ఉందన్నారు.


Tags:    

Similar News