Nepal : తెరుచుకున్న ఖాట్మండు విమానాశ్రయం

నేపాల్ లోని ఖాట్మండు విమానాశ్రయం తెరుచుకుందని పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు తెలిపారు

Update: 2025-09-11 02:24 GMT

ఖాట్మండు విమానాశ్రయం తెరుచుకుందని పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు తెలిపారు. దీంతో భారత్ - నేపాల్ మధ్య విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. అదనపు విమానాలు కూడా ఏర్పాటు చేశామని రామ్మోహన్ నాయుడు చెప్పారు. నేటి నుంచి సాధారణ విమానాలు కూడా ప్రారంభమవుతాయని కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడుతెలిపారు.

సాధారణ ఛార్జీలతోనే...
విమాన సంస్థలు చార్జీలు సాధారణంగా ఉంచాలని కోరినట్లు కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు చెప్పారు. నేపాల్ లో నెలకొన్న అస్థిర పరిస్థితుల దృష్ట్యా అక్కడ చిక్కుకుపోయిన వారిని భారత్ కు తిరిగి రప్పించేందుకు అవసరమైన విమానాలు నేటి నుంచి తిరుగుతాయని చెప్పడంతో ఇక నేపాల్ నుంచి భారతీయులు తిరుగు ప్రయాణం అయ్యేందుకు మార్గం సుగమం అయింది.


Tags:    

Similar News