చైనాలో మళ్లీ లాక్ డౌన్

నిత్యావసర వస్తువుల కోసం రెండ్రోజులకు ఒకసారి.. కుటుంబ సభ్యుల్లో ఒకరు మాత్రమే బయటికి రావాలని సూచించారు. చాంగ్‌చున్ న‌గ‌రంలో

Update: 2022-03-11 12:15 GMT

చైనా : కరోనా వైరస్ కు పుట్టినిల్లైన చైనాలో మరోసారి లాక్ డౌన్ విధించారు అధికారులు. అక్కడ పాజిటివ్ కేసులు మళ్లీ పెరిగిపోతున్నాయి. ఈశాన్య నగరమైన చాంగ్ చున్ లో కొత్త వేరియంట్ బయటపడటంతో అధికారులు కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నారు. కొత్తవేరియంట్ శరవేగంగా వ్యాపిస్తుండటంతో లాక్ డౌన్ విధించినట్లు అక్కడి అధికారులు పేర్కొంటున్నారు. 90 లక్షల జనాభా ఉన్న చాంగ్ చున్ లో కొత్త వేరియంట్ ప్రభావం అధికంగా ఉందని, స్థానికులు ఎవ‌రూ ఇంటి నుంచి బ‌య‌ట‌కు రావొద్దని ఆంక్షలు విధించారు.

నిత్యావసర వస్తువుల కోసం రెండ్రోజులకు ఒకసారి.. కుటుంబ సభ్యుల్లో ఒకరు మాత్రమే బయటికి రావాలని సూచించారు. చాంగ్‌చున్ న‌గ‌రంలో ఉన్న ప్రతి ఒక్కరూ మూడు సార్లు కరోనా ప‌రీక్షలను చేయించుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అత్యవసర సేవలు మినహా.. మిగతా సేవలన్నింటినీ రద్దు చేశారు. ట్రాన్స్ పోర్ట్ లింకులను కూడా మూసివేశారు. 2020 మార్చి తర్వాత.. మళ్లీ ఇప్పుడే చైనాలో అత్యధిక కేసులు నమోదవుతుండటం ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. హాంకాంగ్‌లో కూడా భారీగా కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి.



Tags:    

Similar News