చైనాను వణికిస్తున్న మరో ఫ్లూ

కరోనా వైరస్ తోనే మొన్నటి వరకూ ఇబ్బంది పడుతున్న చైనా ఇప్పుడు తాజాగా కొత్త ఫ్లూ వణికిస్తుంది

Update: 2023-03-13 04:46 GMT

కరోనా వైరస్ తోనే మొన్నటి వరకూ ఇబ్బంది పడుతున్న చైనా ఇప్పుడు తాజాగా కొత్త ఫ్లూ వణికిస్తుంది. ప్రభుత్వం కూడా లాక్‌డౌన్ విధించే యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఫ్లూ కేసులు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. ప్రజలు అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రభుత్వం అప్రమత్తమయింది. ఈ నెల మొదటి వారంలో 25.1 శాతంగా ఉన్న ఫ్లూ కేసులు గత వారానికి 41.6 శాతానికి పెరగడం ఆందోళన కలిగిస్తున్నాయి.

లాక్‌డౌన్ దిశగా...
కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ ఫ్లూ కేసులు పెరుగుతుండటం ప్రభుత్వాన్ని ఆందోళన కల్గిస్తుంది. ముఖ్యంగా జియాన్ నగరంలో ఈ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో అక్కడ లాక్‌డౌన్ ను విధించాలని ప్రభుత్వం యోచిస్తుంది. అయితే ప్రజలు మాత్రం లాక్‌డౌన్ వద్దంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నారు. చైనాలో ఈ ఫ్లూ దేనివల్ల సంబంధిస్తుంది? దీనికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయన్న దానిపై అధ్యయనం ప్రారంభమైంది.


Tags:    

Similar News