ఢిల్లీలో బాలికపై యాసిడ్ దాడి ఘటన.. ఫ్లిప్ కార్ట్ కు కేంద్రం నోటీసులు

ఆన్ లైన్ లో ప్రాణాంతకమైన యాసిడ్ ను అమ్మడం నిబంంధనలను అతిక్రమించడమేనని పేర్కొంది. ఈ నెల 14న ఢిల్లీలోని

Update: 2022-12-17 06:51 GMT

 delhi acide attack case

ఢిల్లీలో ఇటీవల 17 ఏళ్ల బాలికపై ఇద్దరు ఆగంతకులు బైక్ పై వచ్చి యాసిడ్ పోసి పరారైన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. నెట్టింట ఆ ఘటన తాలూకా వీడియో వైరలైంది. ఈ క్రమంలో ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ ప్లాట్ ఫాం ఫ్లిప్ కార్ట్ కు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. నిబంధనలను ఉల్లంఘించి ఆన్ లైన్ లో యాసిడ్ అమ్మినందుకు గానూ వివరణ ఇవ్వాలని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశించింది. 7 రోజుల్లో ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ లలో యాసిడ్ లభ్యతపై నెలకొన్న భయాందోళనలను పరిష్కరించేందుకు అవసరమైన పత్రాలతోపాటు ప్రతి స్పందనను తెలపాలని కేంద్ర మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని సీసీపీఏ కోరింది.

ఆన్ లైన్ లో ప్రాణాంతకమైన యాసిడ్ ను అమ్మడం నిబంంధనలను అతిక్రమించడమేనని పేర్కొంది. ఈ నెల 14న ఢిల్లీలోని మోహన్ గార్డెన్ సమీపంలో 17 ఏళ్ల బాలిక పై జరిగిన దాడి ఘటనలో నిందితులు ఫ్లిప్ కార్ట్ లో యాసిడ్ ను కొనుగోలు చేశారు. అందుకు సంబంధించి.. ఢిల్లీ మహిళా కమిషన్ ఆల్రెడీ ఈ-కామర్స్ వేదికలైన ఫ్లిప్ కార్ట్, అమెజాన్ లకు నోటీసులు జారీ చేసింది. యాసిడ్ దాడిలో బాధిత బాలికకు తీవ్రగాయాలవగా సఫ్దార్ జంగ్ ఆస్పత్రికి తరలించారు. బాలిక ముఖంతోపాటు కళ్లలో కూడా యాసిడ్ పడిందని , ఐసీయూలో చికిత్స అందుతున్నామని వైద్యులు పేర్కొన్నారు.


Tags:    

Similar News