బోరిస్ జాన్సన్ రాజీనామా.. కొత్త ప్రధాని ఎవరంటే?

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా చేశారు. మంత్రులందరూ రాజీనామాలు చేయడంతో ఆయన కూడా ప్రధాని పదవికి రాజీనామా చేశారు.

Update: 2022-07-07 12:22 GMT

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా చేశారు. మంత్రులందరూ వరస బెట్టి రాజీనామాలు చేయడంతో ఆయన కూడా ప్రధాని పదవికి రాజీనామా చేశారు. మంత్రులదరూ డిమాండ్ చేసిన విధంగానే ప్రధాని పదవి నుంచి బోరిస్ జాన్సన్ వైదొలిగారు. బ్రిటన్ లో కన్సర్వేటివ్ పార్టీ కొత్త నేతను ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. కొత్త నేత ఎంపిక అయ్యేంత వరకూ తాను ప్రధాని పదవిలో కొనసాగుతానని బోరిస్ జాన్సన్ అధికారిక ప్రకటనలో తెలిపారు.

గత నెలలోనే...
బోరిస్ జాన్సన్ గత నెలలోనే అవిశ్వాస పరీక్ష ఎదుర్కొని దాని నుంచి బయటపడ్డారు. ప్రభుత్వ మాజీ డిప్యూటీ చీఫ్ విప్ క్రిస్ పించర్ వివాదం జాన్సన్ ను వెంటాడింది. ఆయన గురించి తెలిసినా ప్రాధాన్యత కలిగిన పదవిలో నియమించారని ఎంపీలు, మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దాదాపు నలభై మంది రాజీనామా చేయడంతో జాన్సన్ పై వత్తిడి పెరిగింది. దీంతో ఆయన తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
ఇక కాబోయే ప్రధాని పై...
ఇక కాబోయే ప్రధాని పై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మాజీ ఆర్థిక శాఖ మంత్రి రిసి సునాక్ పేరు ప్రముఖంగా విన్పిస్తుంది. ఆయన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు. సునాక్ పేరుతో పాటు నదీమ్ పేరు కూడా బాగా ప్రచారంలో ఉంది. కన్సర్వేటివ్ పార్టీ కొత్త నేతను ఎన్నుకునేంత వరకూ బోరిస్ జాన్సన్ ప్రధానిగా కొనసాగనున్నారు. మొత్తం మీద బోరిస్ జాన్సన్ అనేక వివాదాల్లో చిక్కుకుని చివరకు రాజీనామా చేశారు.


Tags:    

Similar News