బెలూన్ల పంచాయతీ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు
ఐరోపాలోని బెలారస్, లిథువేనియా దేశాల మధ్య వాతావరణ బెలూన్ల కారణంగా సమస్యలు వస్తున్నాయి.
ఐరోపాలోని బెలారస్, లిథువేనియా దేశాల మధ్య వాతావరణ బెలూన్ల కారణంగా సమస్యలు వస్తున్నాయి. బెలారస్ నుంచి వస్తున్న బెలూన్ల కారణంగా తమ ప్రధాన విమానాశ్రయమైన విల్నియస్ ను గత కొన్ని వారాలుగా పదే పదే మూసివేయాల్సి వస్తోందని లిథువేనియా తెలిపింది. సిగరెట్ల అక్రమ రవాణాకు ఈ బెలూన్లను బెలారస్ వినియోగిస్తోందని ఆరోపించింది. ఇటీవల 60 బెలూన్లు వచ్చాయని, వాటిలో నలభై విమాన భద్రతకు అత్యంత కీలకమైన ప్రాంతంలోకి చొచ్చుకొచ్చాయని తెలిపింది. ఇదొక హైబ్రిడ్ దాడిగా లిథువేనియా వర్ణించింది. అయితే అవి కేవలం వెదర్ బెలూన్లని, ఈ ఆరోపణలు నిజమని తేలితే క్షమాపణలు చెప్పడానికి సిద్ధమని బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో చెప్పారు.