అమెరికాలో కాల్పులు... ఐదుగురు మృతి
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. న్యూయార్క్ లో జరిగిన ఈ కాల్పుల్లో ఐదుగురు మృతి చెందినట్లు సమాచారం
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. న్యూయార్క్ లో జరిగిన ఈ కాల్పుల్లో ఐదుగురు మృతి చెందినట్లు సమాచారం. న్యూయార్క్ లోని మన్ హట్టన్ లో ఆగంతకులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు మరణించారని ప్రాధమికంగా అందుతున్న సమాచారం మేరకు తెలుస్తోంది. మృతుల్లో ఒక పోలీసు అధికారి కూడా ఉన్నట్లు తెలిసింది.
దుండగులు జరిపిన కాల్పుల్లో...
అయితే కాల్పుల ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉంది. దుండగులు విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో ఐదుగురు మరణించగా, మరికొందరికి తీవ్రగాయాలు అయినట్లు తెలిసింది. కాల్పులు జరిపిన దుండగులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పూర్తి సమచారం తెలియాల్సి ఉంది.