అంగసాన్ సూకీకి 4 ఏళ్ల జైలు శిక్ష

మయన్మార్ లో కీలక నేత అగసాన్ సూకీకి నాలుగేళ్ల జైలు శిక్ష విధించారు. ప్రత్యేక కోర్టు ఈ మేరకు తీర్పు చెప్పింది.

Update: 2021-12-07 01:50 GMT

మయన్మార్ లో కీలక నేత అగసాన్ సూకీకి నాలుగేళ్ల జైలు శిక్ష విధించారు. ప్రత్యేక కోర్టు ఈ మేరకు తీర్పు చెప్పింది. కరోనా నిబంధనలను ఉల్లంఘించడంతో అంగసాన్ సూకీకి ఈ శిక్ష విధించినట్లు న్యాయస్థానం పేర్కొంది. 76 ఏళ్ల అంగసాన్ సూకీ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరిలో సైన్యం అధికారాన్ని చేజిక్కించుకుంది.

కరోనా నిబంధనలను...
అప్పటి నుంచి అంగసాన్ సూకి ప్రజలను చైతన్య వంతుల్ని చేసే దిశగా సభలు, సమావేశాలు పెడుతున్నారు. కరోనా సమయంలో ఈ సభలు సరికాదని భావించిన న్యాయస్థానం నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. ఇప్పటికే సూకీపై సైన్యం పలు కేసులను నమోదు చేసింది. ఇతర కేసులను కూడా విచారణ చేయడానికి న్యాయస్థానం అంగీకరించింది.


Tags:    

Similar News