యాభై మంది ప్రయాణికులతో విమానం మిస్సింగ్
రష్యాలో అంగారా ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం మిస్ అయింది.
రష్యాలో అంగారా ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం మిస్ అయింది. ప్రయాణికులతో వెళుతున్న విమానంతో సంబంధాలు తెగిపోయాయి. రష్యాకు తూర్పున ఉన్న చైనా సరిహద్దుల్లో విమానం కనిపించకుండా పోయినట్లు అధికారులు చెబుతున్నారు. చైనా సరిహద్దుల్లోనే ఈ విమానం అదృశ్యమైందని అంటున్నారు. ఇందులో యాభై మంది వరకూ ప్రయాణికులున్నారు.
రష్యాకు చెందిన...
యాభై మందిలో 26 మంది ప్రయాణికులు, 24 మంది సిబ్బంది ఉన్నారు. చైనాకు శివార్లలో ఉన్న అమూర్ ప్రాంతంలోని టిండా ప్రాంతానికి వెళుతున్న అంగారా ఎయిర్ లైన్స్ విమానం గల్లంతు కావడంతో అధికారులు విమానం కోసం గాలిస్తున్నారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో సంబంధాలు తెగిపోవడంతో అధికారులు వెదుకుతున్నారు.