లైవ్ లో న్యూస్ చదువుతున్న యాంకర్.. దూసుకొచ్చిన మిసైల్
ఇరాన్ రాజధాని టెహ్రాన్ పై క్షిపణుల వర్షం కురుస్తోంది.
ఇరాన్ రాజధాని టెహ్రాన్ పై క్షిపణుల వర్షం కురుస్తోంది. ఇజ్రాయెల్ క్షిపణి ఇరాన్ కు చెందిన న్యూస్ ఛానల్ పై పడింది. ఇరాన్ స్టేట్ టీవీ స్టూడియో కాంపౌండ్‌పై క్షిపణి దాడి జరిగింది. అందుకు సంబంధించిన నాటకీయ దృశ్యాలు ఆన్‌లైన్‌లో కనిపించాయి. బులెటిన్ మధ్యలో ఉన్న యాంకర్ సహార్ ఇమామి లేచి వెళ్ళిపోవలసి వచ్చింది. క్షిపణి కారణంగా మొత్తం స్టూడియో వణికిపోయింది. ఈ ఘటనలో యాంకర్ సహర్ ఇమామి, స్టూడియోలోని ఇతర సిబ్బంది సురక్షితంగా ఉన్నారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకోవడంతో ఇజ్రాయెల్ క్షిపణులు ఇరాన్‌లోని పలు ప్రాంతాలపై పడ్డాయి. ఇరాన్ పై తమకు సంపూర్ణ వైమానిక ఆధిపత్యం ఉందని ఇజ్రాయెల్ ప్రకటించింది.