Earthquake : అమెరికాలో భూకంపం
అమెరికాలో భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు భయాందోళనలతో బయటకు పరుగులు తీశారు.
అమెరికాలో భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు భయాందోళనలతో బయటకు పరుగులు తీశారు. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో బే సమీపంలో సోమవారం వేకువ జామున మూడు గంటలకు భూంకంప సంభవించిందని అధికారులు తెలిపారు. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 4.3గా నమోదయిందని తెలిపారు. శాన్ ఫ్రాన్సిస్్కో, బర్కిలీతో పాటు అక్కడికి 161 కిలోమీటర్ల దూరంలో ఉన్న సబినాస్ లోనూ భూ ప్రకంపనల ప్రభఆవం కనిపించిందని చెప్పారు. తీవ్ర భూప్రకంపనలతో ప్రజలు నిద్ర నుంచి మేల్కొని ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
వస్తువులు కిందకు పడి...
ఇంట్లో, దుకాణాల్లోని వస్తువులు కూడా భూప్రకంపనల తీవ్రతకు కిందపడిపోయాయి. కిటికీల అద్దాలు పగిలి పోయయి. రైళ్లు తక్కువ వేగంతో నడిపినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఈ భూప్రకంపనల కారణంగా ఎంత మేరకు నష్టం జరిగిందన్నది ఇంకా తెలియరాలేదు. ఈ భూకంపం 1.6 కిలోమీటర్ల దూరంలో 7.7 కిలోమీటర్ల లోతులో ఉందని మాత్రం తెలిపారు.