Donald : ట్రంప్ అందుకే ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లుందిగా...?

భారత్ తో వాణిజ్య సంబంధాల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగి వస్తున్నట్లు కనిపిస్తుంది

Update: 2025-09-10 03:59 GMT

భారత్ తో వాణిజ్య సంబంధాల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగి వస్తున్నట్లు కనిపిస్తుంది. ఇప్పటి వరకూ భారత్ పై ఆంక్షలతో పాటు సుంకాలు పెంచిన ట్రంప్ భారత్ తో వాణిజ్యచర్చలకు ఎదురు చూస్తున్నానని చెప్పడంతో కొంత ఆయనకు విషయం అర్థమయినట్లుంది. భారత్ రష్యా నుంచి చమురును కొనుగోలు చేయకూడదని సుంకాలు భారీగా పెంచిన డొనాల్డ్ ట్రంప్ భారత్ విషయంలో మరింత దూకుడుగా వెళతారని భావించారు. కానీ భారత్ మాత్రం ట్రంప్ హెచ్చరికలకు, సుంకాల పెంపుదలకు భయపడకుండా తన ప్రయత్నాన్ని కొనసాగించింది. రష్యా, చైనాలతో మైత్రీ బంధాన్ని పటిష్టం చేసుకునే ప్రయత్నాలు మొదలు పెట్టడంతో డొనాల్డ్ ట్రంప్ కంగు తిన్నారు. అగ్రదేశంగా విర్రవీగిన ట్రంప్ ఈ మూడు అగ్రదేశాలు ఏకమైతే అసలుకే ముప్పు వస్తుందని భావించి కొంత మేర దిగి వస్తున్నట్లు కనిపిస్తుంది.

వాణిజ్య చర్యల కోసం...
అందుకే డొనాల్డ్ ట్రంప్ అమెరికా - భారత్ ల మధ్య వాణిజ్య చర్చల కోసం ఎదురు చూస్తున్నానని చెప్పి కొంత మార్గాన్ని సులువు చేసుకునే ప్రయత్నం చేశారు.నిజానికి ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వెళ్లాల్సి ఉండగా కానీ దానిని రద్దు చేసుకుని విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ ను పంపుతున్నట్లు తెలిపారు. తాజాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బుధవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్–అమెరికా వాణిజ్య చర్చలపై చేసిన సానుకూల వ్యాఖ్యలకు సానుకూలంగా స్పందించారు. ఇరు దేశాల మధ్య భాగస్వామ్యానికి అపారమైన అవకాశాలు ఉన్నాయని, ఈ చర్చలు ఆ అవకాశాలను వెలికితీయడానికి మార్గం సుగమం చేస్తాయన్న విశ్వాసం వ్యక్తం చేశారు.
త్వరలో ట్రంప్ తో మాట్లాడాలని...
భారత్–అమెరికాలు స్నేహపూర్వక దేశాలని, సహజ భాగస్వాములని, వాణిజ్య చర్చలను త్వరితగతిన ముగించేందుకు ఇరు దేశాలు కృషి చేస్తున్నాయని మోదీ తెలిపారు. అధ్యక్షుడు ట్రంప్‌తో త్వరలో మాట్లాడాలని కూడా ఎదురుచూస్తున్నాను. రెండు దేశాల ప్రజలకు సమృద్ధి భవిష్యత్తు సాధించేందుకు కలిసి పనిచేస్తామని మోడీ ఎక్స్‌లో పేర్కొన్నారు. అదే రోజు ట్రంప్ కూడా ఇరు దేశాలు వాణిజ్య చర్చల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా విజయవంతమైన ముగింపుకు చేరుకుంటాయని తాను నమ్ముతున్నానని, మోడీ “చాలా మంచి స్నేహితుడు” మోడీతో త్వరలో మాట్లాడాలని ఎదురుచూస్తున్నానని తెలిపారు.దీంతో ఇరు దేశాల మధ్య కొంత సానుకూలమైన చర్చలు జరిగే అవకాశముంది.
















Tags:    

Similar News