Donald Trump : ట్రంప్ మరో కీలక నిర్ణయం.. వీసా కావాలంటే?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత సంచలన నిర్ణయం తీసుకుంటున్నారు

Update: 2025-06-08 02:05 GMT

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత సంచలన నిర్ణయం తీసుకుంటున్నారు. అందులో భాగంగా అమెరికాకు వచ్చేందుకు అవసరమైన వీసాల విషయంలోనూ ఆయన తాజాగా తీసుకున్న నిర్ణయం ఆర్థికంగా భారం పడనుంది. అమెరికా వీసా ఇంటర్వ్యూల కోసం ఏళ్లతరబడి ఎదురుచూడకుండా.. ఓ ప్రత్యేక విధానం ప్రవేశపెట్టాలని ట్రంప్‌ కార్యవర్గం భావిస్తోంది.

వెయ్యి డాలర్లు చెల్లించిన...
ఇందుకోసం వెయ్యి డాలర్లు చెల్లించిన వారికి వీసా ఇంటర్వ్యూ వేగంగా ఏర్పాటుచేసే అంశాన్ని ట్రంప్ సర్కార్ పరిశీలిస్తోంది. అతి త్వరలోనే దీనిని అమల్లోకి తీసుకొచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఈ మేరకు ఓ ప్రతిపాదనను విదేశాంగశాఖ అంతర్గత మెమోలో ప్రస్తావించారు. దీనిని ఓ అమెరికా అధికారి కూడా ధ్రువీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. నాన్‌ ఇమిగ్రెంట్‌ వీసా దరఖాస్తుదారులు, పర్యాటకులు ప్రీమియం ప్రాసెసింగ్‌ ఫీజుగా వెయ్యి డాలర్లు చెల్లిస్తే.. వేగంగా ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిసింది.


Tags:    

Similar News