Earth Quake : అలాస్కాలో భూకంపం..రిక్టర్ స్కేల్ పై?
అలాస్కా–కెనడా యూకాన్ సరిహద్దు సమీ ప్రాంతంలో శనివారం ఉదయం భూప్రకంపనలు సృష్టించాయి
earthquake occurred in cuba
అలాస్కా–కెనడా యూకాన్ సరిహద్దు సమీ ప్రాంతంలో శనివారం ఉదయం భూప్రకంపనలు సృష్టించాయి. రిక్టర్ స్కేల్ పై 7.0 తీవ్రత భూకంపం సంభవించింది. సునామీ ప్రమాదం లేదని అధికారులు తెలిపారు. ప్రాధమిక సమాచారం మేరకు ఎలాంటి నష్టం లేదా గాయాల సమాచారం రాలేదని స్పష్టం చేశారు. అమెరికా జియోలాజికల్ సర్వే వివరాల ప్రకారం, ఈ భూకంపం జూనోకు వాయువ్యంగా 370 కిలోమీటర్ల దూరంలో, యూకాన్‌లోని వైట్‌హార్స్‌కు పడమర దిశగా 155 250 కిలో మీటర్ల దూరంలో నమోదైంది.
తీవ్రత ఎక్కువగా ఉన్నా...
వైట్‌హార్స్‌లో కొందరు ఈ భూకంప తీవ్రతతో భయకంపితులై బయటకు పరుగులు తీశారు.అయితే భూకంపం సంభవించిన ప్రాంతం కొండ ప్రాంతమైందని, అక్కడ జనాభా చాలా తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. పెద్దగా ఆస్తి, ప్రాణ నష్టం ఉండకపోవచ్చని అధికారులు తెలిపారు. రిక్టర్ స్కేల్ పై తీవ్రత ఎక్కువగా నమోదయినప్పటికీ నష్టం మాత్రం తక్కువగా ఉంటుందని తెలిపారు.