Delhi : ఢిల్లీలో అమల్లోకి ఆంక్షలు.. ఏంటంటే?

దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం మరింతగా పెరిగింది. ప్రమాదకర స్థాయికి చేరుకుంది.

Update: 2025-10-20 02:25 GMT

దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం మరింతగా పెరిగింది. ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మూడు వందల మార్కు దాటింది. వాయుకాలుష్యం పెరగడంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలను ప్రారంభించింది. గ్రాప్ 2 చర్యలను ఢిల్లీలో అమలులోకి తెచ్చింది. ఈ చర్యల్లో భాగంగా ఢిల్లీలో నిర్మాణ కార్యకలాపాలపై ఆంక్షలు అమలులోకి రానున్నాయి.

వాయు కాలుష్యం పెరగడంతో...
అలాగే డీజిల్ జనరేటర్లు, కట్టెల పొయ్యిలపై కూడా ప్రభుత్వం నిషేధం విధించింది. దీపావళికి మరింతగా వాయుకాలుష్యం పెరిగే అవకాశముందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. ఉత్తర్ ప్రదేశ్, హర్యానా, పంజాబ్ లలో వ్యర్థాలను తగులపెట్టడం వల్ల ఒక్కసారిగా వాయు కాలుష్యం పెరిగిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. వాయు కాలుష్యం కారణంగా అనారోగ్యానికి గురవుతున్నారని, ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, దీర్ఘకాలిక రోగులు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.


Tags:    

Similar News