96 లీటర్ల రక్తదానం.. గిన్నీస్ రికార్డుకెక్కిన 80 ఏళ్ల మహిళ

కెనడాకు చెందిన ఆమె అరుదైన గిన్నిస్ రికార్డును తన సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా జోసెఫీన్‌పై గిన్నిస్‌ రికార్డ్స్‌ వారు

Update: 2023-03-27 11:59 GMT

80 yrs old woman blood donation

కెనడాకు చెందిన ఓ మహిళ ఆరు దశాబ్దాలుగా రక్తదానం చేస్తూ.. అరుదైన రికార్డు సృష్టించారు. ఇప్పుడు ఆమె వయసు 80సంవత్సరాలు. 60 ఏళ్లుగా ఇప్పటి వరకూ 96 లీటర్ల రక్తదానం చేశారామె. ఆమె పేరు జోసెఫీన్ మిచాలుక్ (80). కెనడాకు చెందిన ఆమె అరుదైన గిన్నిస్ రికార్డును తన సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా జోసెఫీన్‌పై గిన్నిస్‌ రికార్డ్స్‌ వారు పొగడ్తల వర్షం కురిపించారు. రక్తదానంతో ఆమె చాలామంది ప్రాణాలను కాపాడారని పేర్కొన్నారు. జోసెఫీన్ 1955లో 22 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తన సోదరి ప్రోత్సాహంతో తొలిసారి రక్తదానం చేశారు.

ఇప్పటివరకూ సుమారు 203 యూనిట్ల రక్తాన్ని ఇచ్చారు. ఇది సుమారు 96 లీటర్లకు సమానం. 80 ఏళ్ల వయసులోనూ ఆమె రక్తదానాన్ని కొనసాగించడం విశేషం. రక్తదానానికి వయోపరిమితి లేకపోవడం, అందుకు ఆమె ఆరోగ్యం కూడా సహకరించడంతో.. ఇప్పటికీ రక్తదానం చేస్తున్నట్లు జోసెఫీన్ తెలిపారు. ‘‘నా పేరిట ఓ రికార్డు ఉంటుందని నేనెప్పుడూ ఊహించలేదు. అసలు రికార్డుల కోసం నేను రక్తదానం చేయట్లేదు. అయితే.. ఇక ముందు కూడా ఇదే మార్గంలో పయనిస్తా’’ అని ఆమె చెప్పుకొచ్చారు. జోసెఫీన్ బ్లడ్ గ్రూప్ ‘ఓ’ పాజిటివ్. అమెరికాలో ఈ బ్లడ్ గ్రూప్ కి బాగా డిమాండ్ ఉంది.


Tags:    

Similar News