22 మంది చనిపోయారు.. 50 మందికి పైగా మిస్సింగ్

Update: 2022-10-10 01:51 GMT

వెనిజులా దేశం భారీ వర్షాల కారణంగా వణుకుతోంది. సెంట్రల్ వెనిజులాలో కొండచరియలు విరిగిపడటం, నది పొంగిపొర్లడంతో 22 మంది మరణించారు. 50 మందికి పైగా తప్పిపోయారు. దేశంలోని భారీ వర్షాల కారణంగా సంభవించిన ఘోరమైన విపత్తులో ప్రజలు ప్రాణాలు కోల్పోయారని అధికారులు ఆదివారం తెలిపారు. చారిత్రాత్మకంగా అధిక వర్షపాతం కారణంగా ఇటీవలి నెలల్లో డజన్ల కొద్దీ ప్రజలు మరణించారు.

"ఇక్కడ చాలా నష్టం జరిగింది. ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నది కూడా చూస్తున్నాము. ఇప్పటికే 22 మంది చనిపోయినట్లు కనుగొన్నాము, 52 మందికి పైగా తప్పిపోయారు" అని లాస్ టెజెరియాస్ పట్టణంలోని సంఘటన స్థలంలో వైస్ ప్రెసిడెంట్ డెల్సీ రోడ్రిగ్జ్ స్థానిక మీడియాతో అన్నారు. తప్పిపోయిన వ్యక్తులను కనుగొనడానికి పని చేస్తున్నామని తెలిపారు. ఇళ్ళు, వ్యాపార సముదాయాలు ధ్వంసం చేయబడ్డాయి. విరిగిపడిన చెట్లతో పట్టణం వీధులు నిండిపోయాయి. ఎక్కడ చూసినా బురద, శిధిలాలు ఉన్నాయి. కార్లు కూడా కొట్టుకుపోయాయి. గ్రామాలకు గ్రామాలే కొట్టుకుపోయానని అధికారులు వెల్లడించారు. రెస్క్యూ ప్రయత్నాలలో సుమారు వెయ్యి మంది ఉన్నారు. స్థానికులు తమ ఇరుగుపొరుగు వారి కోసం, కుటుంబ సభ్యుల కోసం వెతుకుతున్నారు. చాలా ప్రాంతాల్లో ఇళ్ళు కుప్పకూలిపోయాయి. శిథిలాలలో చిక్కుకున్న వారిని కాపాడడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.


Tags:    

Similar News